
పయ నించే సూర్యుడు జనవరి 29 అమలాపురం
భీష్మ ఏకాదశి శ్రీ విష్ణు సహస్రనామ జయంతి సందర్భంగా గురువారం ఉదయం అమలాపురం గాంధీ సెంటర్ (గడియార స్తంభం) వద్ద రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కంకటాల రామం మాట్లాడుతూ కురుక్షేత్ర యుద్ధం తరువాత కలత చెందిన ధర్మరాజు మనశ్శాంతి, పరమధర్మం కోసం జ్ఞానాన్ని ప్రసాదించమని భీష్మ పితామహుడుని కోరగా అంత సయ్య పై ఉన్న భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్ముని స్తుతిస్తూ ధర్మరాజుకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించి మానవాళికి అందించిన అత్యుత్తమ స్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అని నిత్యము ఈ స్తోత్రాన్ని పట్టించడం వలన భయాలు నశించి రక్షణ కవచం ఏర్పడి మోక్షమార్గంలో పయనించడం జరుగుతుందని ఆయన అన్నారు వందలాది మందికి పంపిణీ చేసిన
ఈ ప్రసాద వితరణ కార్యక్రమంలో అమలాపురం శ్రీ సుబ్బాలమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అప్పన వీరన్న, జంపన సుమన్ వర్మ, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని వారి సేవలను అందించి ప్రసాదాన్ని స్వీకరించారు.
