పయనించే సూర్యుడు ఫిబ్రవరి 22 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ షైక్ సోహెల్ పాషా : ఉట్నూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ని భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్బంగా ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ వారి సతీమణి దృపత భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ని శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్బంగా ఇరువురు ఎమ్మెల్యేలు పలు విషయాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.