పయనించే సూర్యుడు న్యూస్ మే 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తగాదాలతో పాటు తన తండ్రిని హత్య చేశారనే కోపంతో ఆవేశానికి గురైన ఓ యువకుడు లక్ష్మీ అనే మహిళపై గొడ్డలితో దాడి చేశాడు ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం..భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాపల్లికి గ్రామానికి చెందిన మారుపాక లక్ష్మీ, అదే గ్రామానికి చెందిన మారుపాక సారయ్యను గతంలో హత్య చేసిన కేసులో లక్ష్మి నిందితురాలు కొద్దిరోజుల క్రితమే బెయిల్ పై బయటకు వచ్చిన లక్ష్మి కాటారం పోలీస్ స్టేషన్ కు వచ్చి తిరిగి ఇంటికి వెళుతుండగా..అక్కడే ఆమె కోసం కాపు కాసిన మారుపాక సారయ్య కొడుకు మారుపాక అంజి లక్ష్మీపై ఒక్కసారిగా గొడ్డలితో దాడి చేశాడు, చుట్టూ ఉన్నవారు అడ్డుకో వడంతో కొన ఊపిరితో ఉన్న లక్ష్మిని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. దేవరాపల్లి కి చెందిన మారుపాక సారయ్య మారుపాక లక్ష్మి, కుటుంబానికి మధ్య కొంతకాలంగా భూవివాదం నడుస్తుంది. పాత కక్షలు దృష్టిలో పెట్టుకున్న అంజి కాటారం పోలీస్ స్టేషన్ సమీపంలో వృద్ధురాలిపై గొడ్డలితో దాడి చేసినట్టు తెలుస్తుంది..ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం మరింత తెలియవలసి ఉంది