పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందుకాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త చట్టం భూ భారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపుతోందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు ఇల్లందు మండలం బొజ్జయిగూడెం పంచాయతీలో ఎస్ ఎస్ గార్డెన్ నందు భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ సంబంధిత సమస్యలతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఇటువంటివి తలెత్తకూడదనే, ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది అన్నారు. భూ సమస్యలు మార్పులు చేర్పులు, మ్యుటేషన్, ఇతర సమస్యలకు ఈ భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందన్నారు. ఈ చట్టం రైతులకే మాత్రమే కాదని, ఆఫీసర్లకు కూడా ధైర్యం ఇచ్చిందన్నారు. సమస్య ఎంత తీవ్రమైనదైనా నాలుగు అంచెల్లో పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చట్టంపై రైతులు, ప్రజలు అవగాహన కల్పించేందుకే సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మధుగారు, డి ఎల్ పి ఓ రమణగారు, తాసిల్దార్ తోట రవికుమార్ గారు, ఎంపీడీవో దన్ సింగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇల్లందు మండల రైతులు, మండల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మండల నాయకులు, పట్టణ నాయకులు,యువజన విభాగం, మహిళా విభాగం, ప్రజలు తదితరులు పాల్గొన్నారు
ఎండ్ న్యూస్