( పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
ఈ రోజు చౌదరిగూడ రైతు వేదిక వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ,రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ..భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా ప్రతి భూమికి భూధార్ కార్డు ఇస్తామని చెప్పారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ,భూ ధాన్,అసైన్డ్, దేవాదాయ,భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా సిసిఎల్ఏ కి అధికారాలు ఉంటాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చామని,ఎవరి భూమి అయిన వేరే వాళ్ళకు తప్పుగా నమోదైతే ఎమ్మార్వో, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్,కలెక్టర్ కి అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సేవలు గ్రామంలోనే అందుతాయన్నారు.భూ భారతి ద్వారా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు ప్రజలకు అన్ని సేవలు అందించేలా ఉపయోగపడుతుందన్నారు. ధరణి వల్ల రైతులు,భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్ని ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టం భూ భారతి తో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో సరిత,షాద్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి,వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి,రాజు, ఇబ్రహీం,చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు రాజా రత్నం,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రోహిత్ రెడ్డి,గోవర్ధన్ గౌడ్ పురుషోత్తం రెడ్డి, గోపాల్,రాముల గౌడ్,యాదయ్య ఆంజనేయులు,కుమార్ తదితరులు పాల్గొన్నారు.