పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 28//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సు నారాయణపేట జిల్లా మాగనూరు, కృష్ణ మండలాల్లో నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి ఆనాడు పాదయాత్ర లో రైతుల భూ సమస్యల గురించే ఎక్కువ వినతులు వచ్చినందుకు, రైతుల భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలని ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, రెైతులు మరియు అధికారులు పాల్గొన్నారు.