
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:బీఎల్ఓలు, బీఎల్ఏలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల కార్యకర్తల సమన్వయంతో ప్రజలకు అవగాహన • వార్డు నెం.15లో ఎస్ఐఆర్ ఫారం సమర్పించిన ఉర్దూ ప్రెస్ యూనియన్ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ భైంసా, జూలై 22:–భైంసా పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) సమర్థవంతంగా పనిచేయడంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఫారాలు నింపడంలో సహకరిస్తుండటంతో ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. భైంసా పట్టణంలోని వార్డు నెం.15కు చెందిన ఉర్దూ ప్రెస్ యూనియన్ అధ్యక్షుడు, స్టాఫ్ రిపోర్టర్ అక్బర్ ఖాన్ తన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి సంబంధిత బూత్ నెం.150 బీఎల్ఓ కె. నాగమణికి అందజేశారు. ఈ సందర్భంగా బూత్ నెం.149 బీఎల్ఓ కె. మాధురి, ఆర్పీ నీరజ, ఖాజీ అష్ఫాక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి అర్హ ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాలను సకాలంలో సమర్పించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.