
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశం
రాత్రి సమయాల్లో వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించాలి – జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐప
నిన్న అర్థరాత్రి భైంసా పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో సమీపంలో ఉన్న వంతెన పై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటన సమాచారం అందగానే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని వెంటనే నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఈ ప్రమాద స్థలాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ సందర్శించి, ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…రాత్రి సమయాల్లో వీలైనంత వరకు ప్రజలు ప్రయాణాలు తగ్గించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని సూచించారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ, రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని కోరారు. ఈ సందర్శనలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ తో పాటు భైంసా ఏ ఎస్పీ రాజేష్ మీన ఐపీఎస్, భైంసా ఇన్స్పెక్టర్ సాయి కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు
