
భైంసా కీలక ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన SDPO రాజేష్ మీనా
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలి వెలుగుల చక్రపాణి
భైంసా నూతన SDPO గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ మీనా, IPS భైంసా పోలీస్ స్టేషన్ను సందర్శించి, అక్కడి సిబ్బందితో సమావేశమై డ్యూటీ నిర్వహణపై అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను ఇచ్చారు. పోలీసు సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా, చురుకుగా పనిచేయాలని సూచించారు.తర్వాత భైంసా పట్టణంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలైన కోతి దేవుని ఆలయం, పంజేషా మసీదు, జుల్ఫికార్ మసీదులను స్వయంగా సందర్శించి, అక్కడి భద్రతా ఏర్పాట్లు, ప్రజా విభాగాల రద్దీ, శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించారు. అవసరమైన చోట మరింత బలగాలను మోహరించడం, సీసీ కెమెరాల పర్యవేక్షణను బలపరచడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. అలాగే భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న భైంసా SDPO కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని పరిశీలించి, నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా రాజేష్ మీన ఐపీఎస్ మాట్లాడుతూ… భైంసా పట్టణంలో శాంతిభద్రతలను మరింత బలపరచడం, ప్రజలు నిరభ్యంతరంగా జీవించేలా అన్ని చర్యలు తీసుకుంటామని SDPO రాజేష్ మీనా గారు తెలిపారు.ఈ సందర్శనలో SDPO భైంసా రాజేష్ మీన ఐపీఎస్ తో పాటు ఇన్స్పెక్టర్ నైలు, ఎస్ఐ లు జుబేర్, సుప్రియ, సిబ్బంది ఉన్నారు.
