
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: బైసా పట్టణంలోని గోపాల్ రావు డిగ్రీ కళాశాల నందు గోరింటాకు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలోఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గోపాల్రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సహజ మెహందీ తయారీపై అవగాహన కార్యక్రమంనిర్వహించారు.మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేసే లక్ష్యంతో గోపాల్రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో "ఆషాఢ మాసంలో గోరింటాకు విశిష్టత – ఆరోగ్యం, సంస్కృతి, సంప్రదాయం" అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు, అధ్యాపకులు కలిసి సహజసిద్ధంగా లభించే గోరింటాకు ఆకులను సేకరించి, సంప్రదాయ పద్ధతిలో మెహందీ తయారు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. గోరింటాకు కేవలం అలంకరణకు మాత్రమే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులకు వివరించారు.కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా. కె. రఘునాథ్ మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం భారతీయ సంస్కృతిలో ఒక విశిష్ట సంప్రదాయ మని తెలిపారు. వర్షాకాలంలో శరీరంలోని వేడిని సమతుల్యం చేయడం, చర్మానికి చల్లదనాన్ని అందించడం, కొన్ని చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడం వంటి ప్రయోజనాలు గోరింటాకుకు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రకృతి ప్రసాదాలను ఆదరించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు.ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి డా. నహీదా గోరింటాకు తయారీ విధానాన్ని విద్యార్థులకు వివరించి, సహజసిద్ధమైన మెహందీని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు.ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. జె. ఓంప్రకాశ్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను కళాశాలలో నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డా. జె. భీమారావు, డా. శంకర్, డా. యు. రవికుమార్, శ్రీ ఆరె రాజు, డా. సంతోష్ కుమార్, శ్రవణ్య, డా. కల్పన , దివ్య, సురేందర్, ముత్యం, మజర్, అర్షియ , ఉజుమా, తదితర అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంతో పాటు సహజ జీవన విధానంపై ఆసక్తిని కలిగించింది.