
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
నష్టపోయిన పంటను పరిశీలించిన ఎమ్మెల్యే పటేల్
నిన్న ఈదురు గాలులతో వర్షం వడగల్లు కురవడంతో నియోజకవర్గంలో మొక్కజొన్నఇతర పంటలు వేసిన రైతాంగానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తక్షణమే అదు కోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ డిమాండ్ చేశారు. తానూర్ మండలం లోని ఎల్వత్ లో నష్టపోయిన మొక్కజొన్న, జొన్న పంటలను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని, మొక్కజొన్న, జొన్న, శనగ రైతులు అపారంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. మొక్కజొన్న ఎకరానికి 30 నుంచి 40 క్వింటాల్ల దిగుబడి వస్తే, ఈ వర్షంతో ఎకరానికి ఐదు కుంటలు మాత్రమే వచ్చే పరిస్థితి ఉందని తక్షణమే అధికారులు స్పందించి సర్వే చేపట్టాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, రైతుల పక్షాన పోరాడుతానన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో పంట నష్టాన్ని వివరిస్తామన్నారు. ఎకరానికి 50వేల రూపాయల వరకు నష్టపోయారని ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.
