
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి ,ఏ తృతీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న ఐండ్ల లక్ష్మారెడ్డి తండ్రి నర్సారెడ్డి గ్రామం దేగాం, ఇటీవల సి ఆర్ పి ఎఫ్. కానిస్టేబుల్ గా ఎంపికై కళాశాలకు గర్వకారణంగా నిలిచారు.ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పవన్ కుమార్ పాండే మాట్లాడుతూ,“ఐండ్ల లక్ష్మారెడ్డి సాధించిన ఈ విజయం మిగతా విద్యార్థులకు ఆదర్శం. వారు కూడా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, తల్లిదండ్రులకు సహాయ సహకారాలు అందిస్తూ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి”అని ఆకాంక్షించారు.ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ జే. భీమారావు, యు.రవికుమార్, డాక్టర్ శంకర్, అరె రాజు, డాక్టర్ ఓం ప్రకాష్, డాక్టర్ సంతోష్, జి. కిషన్ పాల్గొని, శాలువాతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు .
