
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివిలుగుల చక్రపాణి.
భైంసా పట్టణంలోని గోపాల్రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటరు దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓటరు ప్రాముఖ్యత, ఓటు హక్కు విలువ, ప్రజాస్వామ్యంలో యువత పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య విద్యార్థులను ఉద్దేశించి ఓటరు హక్కు ఎంత విలువైనదో, ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని విస్తృతంగా వివరించారు.ఈ కార్యక్రమాన్ని జాతీయ సేవా పథకం యూనిట్–1, యూనిట్–2 , పొలిటికల్ సైన్స్ & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించాయి. కార్యక్రమానికి ప్రధాన స్పీకర్గా హాజరైన పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు టి.సురేందర్ ఓటు హక్కు, దాని విధులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు పాత్రపై విద్యార్థులకు స్పష్టంగా అవగాహన కల్పించారు.కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆరే రాజు, డా. జాదవ్ ఓం ప్రకాష్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్ , అధ్యాపకులు డా. పవన్ కుమార్ , యు. రవికుమార్, డా. శంకర్, గుంత సుధాకర్,డా. సంతోష్ కుమార్, డా. కల్పన,దివ్య, డా. నహేదా, కిషన్, రామ్మోహన్, రాజయ్య, అబ్దుల్లా,శ్రావణ్య, ఇర్ఫాన్, వాహీద్, ఆఫ్రిన్ సుల్తానా, ఉజుమా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు.పెద్ద సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
