
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: భైంసా పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు మున్సిపల్ కార్మికులకు కిట్ డ్రెస్సులు, గ్లౌజులను *ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ , మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తు * పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలో మున్సిపల్ కార్మికుల సేవలు ఎంతో విలువైనవని తెలిపారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తు , మున్సిపల్ కమిషనర్ మామిడిపల్లి లింగయ్య , మరియు కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.