
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో :భైంసా పట్టణంలోని గురుకృపా వొకేషనల్ కాలేజీలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డా. ముష్కం రామకృష్ణ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భైంసా మున్సిపాలిటీ చైర్మన్ తూమొల్ల దత్తు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్, సుభాష్,అడ్వకేట్ ప్రవీణ్ కుమార్,తెలంగాణ గౌడ సంఘం నాయకులు గంగాధర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్,బిజెపి నాయకులు భోస్లే బాజీరావు పటేల్, డా. మహిపాల్,హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండపు కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తు మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆలోచనలు, ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఐక్యత, ఆత్మగౌరవం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.సమాజ అభ్యున్నతి కోసం యువత ఐక్యంగా పనిచేసి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, యువత, సంఘాల నాయకులు పాల్గొన్నారు.