
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి.
భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాలన శాస్త్రం బోధిస్తున్న సీనియర్ అధ్యాపకులు డా. భీమ్ రావ్ , అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి కళాశాలకు గర్వకారణమని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డా. పవన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం డా. భీమ్ రావ్ ఇంకా మరెన్నో ఉన్నత పదవులను అలంకరించాలని కోరారు.పదోన్నతి పొందిన సందర్భంగా డా. భీమ్ రావ్ మాట్లాడుతూ,
తన వృత్తి జీవితంలో తనను ప్రోత్సహించి అండగా నిలిచిన తన పీహెచ్డీ గైడ్, ప్రిన్సిపాల్, సహచర అధ్యాపకులు, మిత్రబృందానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్, అధ్యాపకులు **డా. రవి కుమార్, డా. శంకర్ గుంత, సుధాకర్ ఆరే, రాజు, డా. ఓం ప్రకాష్, డా. సంతోష్ కుమార్, సురేందర్, డా. కల్పన, డా. నాహేద, దివ్య, హర్షియా, మజార్, అబ్దుల్లా, రామ్ మోహన్, కిషన్, శ్రావణ్య, ఉజ్మా తదితరులు పాల్గొన్నారు.