
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి: భైంసా, జూలై 20: గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల (Guest Faculty) నియామకం చేపట్టనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయుటకు, కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్, అర్థశాస్త్రం, వాణిజ్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, చరిత్ర సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు చొప్పున ఖాళీలు ఉన్నాయి.ఉర్దూ మాధ్యమంలో బోధన చేయుటకు- జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం, రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఉర్దూ, సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు చొప్పున నియామకాలు చేపట్టనున్నారు.అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. నెట్, సెట్, పీహెచ్.డి. అర్హతలు మరియు బోధనా అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నియామకాలు కళాశాల విద్యా కమిషనర్ నిబంధనల మేరకు చేపట్టబడతాయి.దరఖాస్తు సమర్పించే సమయంలో విద్యార్హతలు, కుల ధ్రువీకరణ పత్రం, అనుభవ ధ్రువీకరణ పత్రం తదితర అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులపై గెజిటెడ్ అధికారి సంతకంతో (Attestation) సమర్పించాలని ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య తెలిపారు.దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జూలై 22, 2026 సాయంత్రం 4:30 గంటలు. అనంతరం జూలై 23, 2026 ఉదయం 11:00 గంటలకు కళాశాల ఆవరణలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.