
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా,300 మంది పోలీసులతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు
శోభాయాత్ర బందోబస్తునుద్దేశించి అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్
నిర్మల్ జిల్లా భైంసా లో జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు 300 మంది పోలీసు సిబ్బందిని మోహరింపజేసి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. భైంసా లోని ముఖ్య ప్రాంతాలు, రద్దీ కూడళ్లలో ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అలాగే, డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తూ, ప్రతి కదలికను పర్యవేక్షించనున్నట్లు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
