పయనించే సూర్యుడు జనవరి 13 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య మానకొండూర్ నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు ఎమ్మెల్యే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో ప్రతి ఇంట్లో భోగి మంటల వెలుగులు భోగ భాగ్యాలను నింపాలని ఇంటిల్లిపాది ఎంతో ఆనందంతో పండగ జరుపుకోవాలని ఆయన అన్నారు భోగి సంక్రాంతి కనుమ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అందరూ కలుపుగోలుగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు పతంగులు ఎగురవేసినప్పుడు పిల్లలు పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు నిషిద్ధ చైనా మాంజా వాడకూడదని ఎమ్మెల్యే సూచించారు