పయనించే సూర్యుడు ఆగష్టు 21 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం,కొత్త తండా(పి), పంచాయతీ,మాలపల్లి గ్రామానికి చెందిన గుమ్మడి జానకిరామ్ రాంపురం పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నారు, విధులు నిర్వహించుకొని ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ప్రమాదవషాత్తు బైక్ అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై ఆసుపత్రికి తీసుకెళ్ళే మార్గం మధ్యలో మృతిచెందారు,విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ పార్ధివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.ఈ కార్యక్రమంలో బేతంపూడి సొసైటీ చైర్మన్. లక్కినేని సురేందర్ , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కినేని శ్యామ్ ,ముచ్చా సుధాకర్, మురళీ,లక్ష్మయ్య,బానోత్ రవి,జింకల రాజు,నరసయ్య, జానకిరాములు, సర్వయ్య, జీవీ రాజు, గురుప్రసాద్, ని,హనుమంతు,జోగ గోవర్ధన్, సుధీప్ తదితరులు పాల్గొన్నారు.