పయనించే సూర్యుడు , తొర్రూరు డివిజన్, ప్రతినిధి శ్రీరామ్ నవీన్,
మహబూబాబాద్ జిల్లా, తోరూర్ , డివిజన్ కేంద్రంలో, గత మూడు నెలలుగా, మంచినీళ్లు, (నల్ల నీరు) రాకపోవడంతో, ఇంటి నెంబరు 15…172/1.. నుండి 15..180, నంబరు గల ఇంటి వరకు, నివసించే నివాసితులను కలుపుకొని, స్థానిక తోరూర్ మున్సిపాలిటీ, కమిషనర్ కు, వినతి పత్రం అందించడం జరిగింది, తొర్రూర్ డివిజన్ కేంద్రంలో, దాదాపు, మెయిన్ రోడ్డుకు నివాసం గల, ప్రతి ఇంటి వారు, నల్ల నీరు పై ఆధారపడుతున్న విషయం, ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ, నిమ్మకు నీరెత్తినట్లు, వ్యవహరించడంతో, దాదాపు పదిమందిని కలుపుకొని, తోరూరు మున్సిపల్ కమిషనర్ శాఖ అధికారికి, వినతి పత్రం అందించడం జరిగింది, ఇప్పటికైనా, వచ్చేది ఎండాకాలం కాబట్టి, మంచినీటి ఎద్దడి లేకుండా, చూడగలరని, మున్సిపల్ కమిషనర్ ను, కోరడం జరిగింది, ఈ కార్యక్రమంలో తాటికొండ సదాశివరావు, లక్ష్మయ్య, శ్రీను, వెంకన్న, మల్లేష్, కే శ్రీనివాస్, తదితరులు పాల్గొనడం జరిగింది…