షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన షాద్ నగర్ ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్)
వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు.మండలాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎక్కడైనా సారి పైప్ లైన్ లీకేజి జరిగితే తక్షణమే స్పందించి లైకేజీలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. భైరంపల్లి గ్రిడ్ సెగ్మెంట్ లో వాటర్ సప్లై పుంపులు పదే పదే రిపేర్ అవుతున్న నేపథ్యంలో 19 గ్రామాలకు నీళ్లు సరఫరా లో తలెత్తుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఆ సమస్య పునరావృతం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మండలాల వారీగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. ఎక్లాస్ ఖన్ పేట్ గ్రామ పరిధిలో గల వడ్డే వాడ కు అతి త్వరలో పైప్ లైన్ వేయటానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ఏఈ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజు ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్ ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఇంట్ర) నాగేశ్వర్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సందీప్,అబ్దుల్ బారి,అన్ని మండలాల మిషన్ భగీరథ గ్రిడ్,ఇంట్రా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పాల్గొన్నారు.