
మాజీ జర్నలిస్టు రవి చిరస్మరణీయుడు
టీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ కేపీ
మాజీ జర్నలిస్టు రవి కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు
( పయనించే సూర్యుడు డిసెంబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
మంచి మిత్రుడుగా, పాత్రికేయ వృత్తిలో స్వచ్ఛత నిండిన సహచరుడుగా సోలిపూర్ రవితో తనకు ఎంతో అనుబంధం ఉందని, అతడు మరణించిన ప్రతి ఒక్కరి హృదయంలో చిరస్మరణీయుడుగా ఉంటాడని సీనియర్ జర్నలిస్టు ఏపీ అన్నారు. మాజీ సాక్షి జర్నలిస్ట్ రవి కుటుంబాన్ని డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టు కేపీ, ఇతర జర్నలిస్టులు పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కేపీ రవి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ విలువలు కలిగిన పాత్రికేయులలో మాజీ జర్నలిస్టు రవి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జర్నలిస్టులు జాకీర్, రంగనాథ్, నరసింహారెడ్డి, సాక్షి శ్రీశైలం, ప్రవీణ్ యాదవ్, టిఎన్జీవో నాయకులు ఎం. వెంకట రెడ్డి తదితరులు రవి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు..
