
పయనించే సూర్యుడు న్యూస్ :టాలీవుడ్ హీరోగా రాణిస్తోన్న మంచు ఫ్యామిలీ కథానాయకుడు మంచు మనోజ్.. ఆ మధ్య సినిమాలకు బాగా గ్యాప్ తీసుకున్నాడు. రీ ఎంట్రీ తర్వాత ఈయన రూట్ మార్చుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే విలన్‌గానూ రాణిస్తున్నాడు. భైరవం, మిరాయ్ సినిమాల్లో తనదైన విలనిజంతో ఆకట్టుకున్నాడు మనోజ్. ఇప్పుడీయన డేవిడ్ రెడ్డి పేరుతో ఓ పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. హనుమా రెడ్డి యక్కంటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో బ్రిటీష్ వారిని ఎదుర్కొన్న విప్లవ కథానాయకుడిగా ఇందులో కనిపించబోతున్నారని సమాచారం. డేవిడ్ రెడ్డి మూవీలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో పాటు కోలీవుడ్ హీరో శింబు నటించబోతున్నారట. అయితే ఫుల్ లెంగ్త్ రోల్స్ కాదు. వీరిద్దరు గెస్ట్ రోల్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మంచు మనోజ్‌తో ఉన్న ఫ్రెండ్షిప్తో డేవిడ్ రెడ్డిలో నటించడానికి రామ్‌చరణ్‌తో పాటు శింబు అంగీకరించినట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్, శింబు ఫ్రీడమ్ ఫైటర్లుగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో డేవిడ్ రెడ్డి షూటింగ్లో రామ్‌చరణ్, శింబు పాల్గొననున్నట్లు సమాచారం. తాజా సమాచారం మేరకు డేవిడ్ రెడ్డి సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కూడా గెస్ట్ పాత్రల్లో అలరించబోతున్నారు. ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు.. ఒకరేమో కోలీవుడ్ స్టార్ శింబు కాగా.. మరొకరు టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. మరోవైపు మెగా 158లో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తాడంటూ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ మాత్రం కమ్ బ్యాక్ తర్వాత మనోజ్ ఓ వైపు హీరోగా, మరో వైపు విలన్ పాత్రల్లో నటిస్తూ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడని అంటున్నారు.