
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:భైంసా మండలంలోని మంజ్రి గ్రామంలో వీఓ మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణ పనులకు ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు వీఓ మహిళా సమైక్య సంఘ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. భవన నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాతినిధులు, మండల సీనియర్ నాయకులు, అధికారులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.