
పయనించే సూర్యుడు, డిసెంబర్ 22( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండపల్లి గ్రామానికి నూతన సర్పంచ్‌గా ఎన్నికైన గాధగోని సాగర్ అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ గాధగోని సాగర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఐకెపి కేంద్రం సక్రమ నిర్వహణతో పాటు మురికి కాలువలు, రోడ్లు తదితర మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజల సహకారంతో. మండపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.