పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 19. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్. గుగులోత్ భావుసింగ్ నాయక్ :మేస్త్రీలకు ఇంజనీరింగ్ నిపుణులతో కలెక్టరేట్ లో శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు ఇందిరమ్మ ఇల్లు గృహ మోడల్ నమూనా ఇల్లు నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మండలానికో నమూనా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం తరుణిహాట్ ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇల్లు నిర్మించే స్దలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నమూనా ఇళ్ళు నిర్మాణం ప్రతి లబ్దిదారులకు మంచి మంచి భరోసా ఇచ్చే విధంగా ఉండాలని అన్నారు. మండల ప్రజలు ఇక్కడకి వచ్చి నిర్మించిన ఇంటిని పరిశీలించి వారి స్థలాల్లో నిర్మించుకునేందుకు వీలుగా నమూనా ఇల్లు ఉండాలని తెలిపారు. స్వంత ఇల్లు, ప్రతి పేదవాని కల అని, అది నెరవేరే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ళు పద్దతి ప్రకారం నిర్మించేందుకు మేస్త్రీలకు అవసరమైన శిక్షణను ఇంజనీరింగ్ నిపుణులతో అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.జిల్లా కలెక్టర్ తనిఖీల సందర్భంగా హౌజింగ్ ఇఇ శ్రీనివాసరావు, పీఆర్ ఇఇ వెంకట రెడ్డి, ఖమ్మం రూరల్ మండల తహసిల్దారు రాంప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.