పయనించే సూర్యడు చిహెచ్.విద్యా సాగర్ దేవీపట్నం మండలం ఫిబ్రవరి 12. డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమహేంద్రవరం,మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం పారా లీగల్ వాలంటీర్ తెల్లం శేఖర్ మాట్లాడుతూ….అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండలం, ఇందుకూరు పేట గ్రామపంచాయతీ మరియు ఇందుకూరు గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల్లో మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం పారా లీగల్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో దివ్యాంగులను గుర్తించటం కోసం డోర్ టు డోర్ నిర్వహించడం జరిగిందన్నారు.ఇందుకూరుపేట గ్రామంలో రౌతు నాగ వెంకట సాయి దుర్గ (మూగ),శారపు రామలక్ష్మి (మూగ) ఇందుకూరు గ్రామంలో పరదా వెంకటేశ్వరులు కు (సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి),చవలం చిన్నప్ప దొర గారి కుమార్తె చవలం నవ్యశ్రీ (చికెన్ సెల్ ఎనీమియా వ్యాధి) ఉన్నట్టు గుర్తించమన్నారు.అలాగే యూపీఐ సెషన్ వ్యాక్సీనేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అధార్టీ రాజమహేంద్రవరం,మండల న్యాయ సేవాధికార సంస్థ రంపచోడవరం పారా లీగల్ వాలంటీర్స్, కారం రామన్న దొర,యలగాడ నాగేశ్వరరావు,బి.చక్రి,ఏఎన్ఎం కారం సత్యవతి,ఏఎన్ఎం డి.మంజులరెడ్డి,హెల్త్ అసిస్టెంట్ ఆర్.శ్రీను,అంగన్వాడి టీచర్ శారపు లక్ష్మి కుమారి,ఆశ వర్కర్ రత్నం, అంగన్వాడి హెల్పర్ (ఆయా) జయ మొదలైన వారు పాల్గొన్నారు.