
శ్రీను ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి తండా అభివృద్ధిలో నీకు వెన్నంటూ నేనుంటా ఎమ్మెల్యే హామీ
( పయనించే సూర్యుడు జనవరి 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్ నగర్ మండలం సర్పంచుల సంఘం కార్యనిర్వాహన కార్యదర్శిగా దేవుని బండ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ మూడవత్ శ్రీను ఎన్నికయ్యారు. ఫరూక్ నగర్ మండల సర్పంచ్ల సంఘం ఎన్నిక సందర్భంగా శ్రీను కు ఈ అవకాశం దక్కింది. మండలంలో అత్యధిక మెజార్టీ సాధించిన సర్పంచులలో ఆయన ఉన్నారు. మంగళవారం నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా ఈ అవకాశం దక్కింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ తదితరులు శ్రీను గారిని సన్మానించారు. వీరందరూ మరింత రాజకీయంగా రాణించాలని గొప్ప పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు అదే విధంగా ఫరూఖ్ నగర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడుగా ఎన్నికైన ర్యాకల శ్రీనివాస్, ఫరూఖ్ నగర్ మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వెల్ జర్ల గ్రామ సర్పంచ్ ఆర్ బాబు నాయక్ కార్యదర్శి శివారెడ్డి లను ఫరూఖ్ నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో షాద్నగర్ ఫరూక్నగర్ మండల కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు..