పయనించే సూర్యుడు, పినపాక, మార్చి 19: నేడు పినపాక లోని ఎల్చిరెడ్డిపల్లి ఉన్నత ఆశ్రమ పాఠశాలలో బాలమేళా జరిగింది. ఇందులో మండలంలోని గిరిజన ప్రాధమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి బహుమతి దుగినేపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాల కి, రెండో బహుమతి ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ ప్రాధమిక పాఠశాల కి, మూడో బహుమతి రామానుజరం గిరిజన ప్రాథమిక పాఠశాలకి వచ్చినవి.ఈ కార్యక్రమం లో ఎం ఇ ఓ నాగయ్య, ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రతానోపాధ్యాయురాలు వీరాకుమారి తదితరులు పాల్గొన్నారు.