పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 8- రిపోర్టర్ (కే శివకృష్ణ ) బాపట్ల పట్టణానికి మణిహారం పట్టణంలోని పాత బస్టాండ్ ప్రయాణికులకు ఏ ఊరు వెళ్లాలన్న అది పాత బస్టాండ్ నుండే మొదలవుతుంది. ఒక్కపుడు ఈ ప్రాంగణం ప్రయాణీకులకు ఎంతో ఆసరాగా ఎండకు వానకు అలసట తీరే ప్రాంతంగా ఉండేది. అయితే రోడ్ల విస్తరణ దృష్ట్యా ఆప్రాంతం కాస్త బస్సులు నిలిపేందుకు మాత్రమే సరిపోతుంది. ప్రయాణీకులకు మాత్రం కష్టాల ఉబిగా మారింది మార్చి నెల మొదలులోనే ఎండలు మండిపోతున్నాయి,ప్రయాణికులు (వృద్దులు,వికలాంగులు,బాలింతలు సైతం ఎండలో ఎండుటకుల వలె నిస్సహాయులుగా నిలుచుంటున్నారు. వారికి నిడగా చాలి చాలని రేకుల షెడ్డు కనీసం ప్రయాణికులకు మంచినీరు కుడా కరువుగా ఉందని ప్రయాణికులు చెప్పుకుంటున్నారు. రానున్న వేసవి ని, ఇంకా పెరగబోయో మండే ఎండలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు ప్రయాణికులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని ప్రయాణికులు కోరుతున్నారు.