పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి9. మక్తల్తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని నారాయణపేట జిల్లా మఖ్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి సోదరుడు శేషగిరితో పాటు ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. సందర్భంగా నియోజకవర్గ పరిధిలో నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ కు సంబంధించిన పెండింగ్ విషయాలపై చర్చించి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు సైతం చేపట్టాలని కోరారు.