
పయనించే సూర్యుడు డిసెంబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా నంద్యాల జిల్లా కార్యవర్గ కమిటీని 40 మంది సభ్యులతో విజయవంతంగా ఎంపిక చేశారు. పార్టీ అధిష్టానం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి క్రియాశీలక నాయకురాళ్లకు జిల్లా కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించింది. నంద్యాల పట్టణంలోని 24వ వార్డుకు చెందిన కరిష్మా భాను ను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అలాగే 38వ వార్డుకు చెందిన బి. సౌభాగ్య ను జిల్లా సెక్రటరీగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన కరిష్మా భాను మరియు బి. సౌభాగ్య శనివారం నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు వారు మంత్రి ఫరూక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ ప్రతిష్టను మరింత పెంచాలని ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో 24 వార్డ్ టీడీపీ ఇంచార్జి సాయిరాం రాయల్, జ్యోతి రాయల్, 38 వార్డ్ టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గ రాముడు, అడ్వకేట్ నందం బాబురావు, ప్రసాద్ రెడ్డి మరియు పార్టీ ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.

