పయనించే సూర్యుడు జనవరి 21 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గం మందస మండలం బాలిగాం గ్రామంలో సోమవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పశువులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు భావన దుర్యోధన పాల్గొని మాట్లాడుతూ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల కోసం పశువైద్య శిబిరాలు కార్యక్రమంను ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం జరిగిందని, ప్రతీ రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ పశువైద్య శిబిరాలు జనవరి 30 వరకు ప్రతీ పంచాయతీ లో రెండు బృందాలు గా ఏర్పడి వ్యాక్సిన్ లు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దువ్వాడ శ్రీకాంత్, కిల్లి ఉమాభారతి, అసిస్టెంట్లు దేవేంద్ర,మురళి మరియు రైతులు పాల్గొన్నారు.