పయనించే సూర్యడు // మార్చ్ // 7 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంద రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు.రాజిరెడ్డి కుటుంబ సభ్యులను కొమ్మిడి రాకేష్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.కొమ్మిడి రాకేష్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొండల్ రెడ్డి, మల్లారెడ్డి పల్లె మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, దేశాయి పల్లె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, శ్రీ పాల్ రెడ్డి, కర్ర తిరుపతిరెడ్డి, సమ్మిరెడ్డి,కర్ర రాంగోపాల్ రెడ్డి, దావు రాజిరెడ్డి, గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు