
{పయనించే సూర్యుడు }{ఏప్రిల్ 15మక్తల్ }
మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.గూడెం శ్రీనివాసులు జిల్లా అధ్యక్షులుఅంబేడ్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదు, ఆయన యావత్ భారతదేశానికి గర్వకారణం. ఆయన అందించిన రాజ్యాంగ ఫలాలు నేడు ప్రతి ఒక్కరికీ రక్షణగా నిలుస్తున్నాయి. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి." అన్నారు
పాలెం వెంకటయ్య జిల్లా ఉపాధ్యక్షుల సమాజంలో అసమానతలు తొలగి, అందరూ సమానంగా ఎదగాలని అంబేడ్కర్ కలలు కన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవడం మనందరి బాధ్యత."అన్నారు
బండారు కృష్ణ (జిల్లా ప్రధాన కార్యదర్శి): "చదువు ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని అంబేడ్కర్ నమ్మారు. మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా విద్యార్థుల ఉన్నతికి మరిన్ని కార్యక్రమాలు చేపడతాం." అన్నారు
బండారి చంద్రశేఖర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ హక్కుల కోసం పోరాడటమే కాకుండా, బాధ్యతగల పౌరులుగా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ నాయకులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు మరియు అంబేడ్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.