
{పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి 11మక్తల్ }
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం నర్వ మండలం పాతచేడు గ్రామంలో జరిగింది.స్థానిక సర్పంచ్ లింగమ్మ మన్యం అధ్యక్షతన జరిగిన ఈ క్రీడా పోటీలకు జిల్లా క్రీడా యువజన సంక్షేమ అధికారి శెట్టి వెంకటేష్, నర్వ మండల ఎంఈవో రామిరెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ప్రజాసంబంధాల అధికారి కాలేరు సురేష్, పాతచేడు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు భాస్కర్, పీఈటీ అసోసియేషన్ మండల అధ్యక్షులు వెంకటప్ప, ఫిజికల్ డైరెక్టర్లు సాయినాథ్, విష్ణువర్ధన్, బాలరాజు, అనంతసేన తదితరులు పాల్గొన్నారు.అలాగే స్థానిక నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నయ్య, సాగర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లంకాల మహేష్, ఉపసర్పంచ్ వాకిటి ఆంజనేయులు, జిల్లా నాయకులు బోలుబంఢ వెంకటేష్, ఆత్మకూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ N వెంకటయ్య, గ్రామ వార్డు సభ్యులు గద్వాలకొండన్న పోతురాజు అనంత వెంకటయ్య జులుపల్లి ఆంజనేయులు నక్క అంజమ్మ ఎల్లప్ప బురెడ్డి వందన వెంకటేష్ వడ్డే బుడ్డన్న బోయ భరత్ గ్రామ పెద్దలు G శేఖర్ K సీతరాములు గౌడ్ KC నరసింహులు K రాఘవేందర్ గౌడ్ మరియు జంగం రెడ్డిపల్లి రాజారెడ్డి రవీందర్ రెడ్డి రాజుపల్లి సర్పంచ్ M సంజీవరెడ్డి రాయికోడు ఆంజనేయులు తాయప్ప గౌడ్ ఉందెకొడు కొండప్ప ఉపాధ్యాయ బృందం సదన్ రావు, సత్యనారాయణ రెడ్డి, శివశంకర, రాములు మిగతా ఉపాధ్యాయ బృందంకూడా కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా
వాలీబాల్ (విద్యార్థులు) కబడ్డీ (విద్యార్థులు, విద్యార్థినులు),ఖో-ఖో (విద్యార్థులు, విద్యార్థినులు) విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించారు.మక్తల్ అర్బన్, మక్తల్ రూరల్, మాగనూరు, కృష్ణ, నర్వ, అమరచింత అర్బన్, అమరచింత రూరల్, ఆత్మకూరు, ఊట్కూరు మండలాల నుండి వచ్చిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి.
సీఎం కప్ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు విద్యార్థులు, విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కార్యక్రమం గ్రామీణ క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
