పయనించే సూర్యుడు// ఆగస్టు16// మక్తల్
మక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకుని జనసేనపార్టీ నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ ఆద్వర్యం లో జాతీయ జెండా పతాక ఆవిష్కరణ జరిగింది,అనంతరం డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం అంత సులబంగా రాలేదు ఎందరో మహనీయుల పోరాటం త్యాగాల వల్ల మనకు స్వాతంత్ర్యం రావడం జరిగింది ఆ రోజు ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు అలుపెరగని పోరాటం ఎందరో వీరుల వీరోచిత పోరాటం మరెందరో మహానుభావుల త్యాగాలను మనం మరవలేం మనం వారిని ఎల్లపుడు స్మరించుకుంటూ ఉండాలి. స్వాంతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు అవుతున్న ఇంకా మన దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది విద్యా వైద్యం నీరు గూడు గుడ్డ ఇలా ఇంకా నిరుద్యోగం రైతుల సమస్యలు అవినీతి రాజకీయాలు
మరియు దేశ ప్రజలు ఇంకా చైతన్యం కావాలి నోటుకు ఓటు అనే సంప్రదాయాన్ని పారద్రోలి మంచి సరి అయిన ప్రజాప్రతినిధి ను ఎన్నుకుని దేశనిర్మాణం లో పలు పంచుకొనే లా నాయకులను ఎన్నుకోవాలి ముఖ్యంగా యువత భారతదేశ దశ దిశ ను మార్చే శక్తి ఉంది కావున యువత అన్ని రంగాల్లో లాగా రాజకీయం లో కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు జన సైనికులు పాల్గొనడం జరిగింది మక్తల్ నియోజకవర్గం డాక్టర్ మణికంఠ గౌడ్ టీం