ప్రజలకు పోలీసుల సేవలు , పెండ్లి పోలీసింగ్ ప్రాముఖ్యత.
పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించిన పోలీసులు.
విద్యార్థులు ఆపదలో ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచన.
{పయనించే సూర్యుడు }{న్యూస్ అక్టోబర్ 15}
మాగనూరు మండలం నేరేడ్గం గ్రామంలోని శ్రీ సిద్ద లింగేశ్వర విద్యాలయం విద్యార్థులు మంగళవారం రోజు మక్తల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులకు పోలీస్ శాఖ దినచర్య, విధులు, పనితీరు, పోలీస్ స్టేషన్లో జరిగే వివిధ కార్యకలాపాలు విద్యార్థులకు వివరించారు. వైర్లెస్ సెట్ ద్వారా మాట్లాడే విధానం, పోలీసు లాకప్, FIR రిజిస్ట్రేషన్ విధానం, పహారా డ్యూటీలు, సీసీ కెమెరాల పనితీరు, సీసీ కెమెరా మానిటరింగ్ సిస్టమ్, డయల్ 100 సేవలు, మహిళా భద్రత చర్యలు, పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులకు రిసెప్షన్ లో ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, పోలీస్ చట్టాలపై అవగాహన తదితర అంశాలను ప్రాక్టికల్‌గా చూపించి విద్యార్థులకు అవగాహన కల్పించిన *మక్తల్ సీఐ రామ్ లాల్ ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ఎలాంటి వేగవంతమైన చర్యలు తీసుకుంటారో, ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించే విధానం, సంఘటన స్థలానికి చేరుకోవడం, సహాయక చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.అలాగే “ఫ్రెండ్లీ పోలీసింగ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో పోలీసుల పట్ల విశ్వాసం పెంపొందించడం, చిన్నారుల్లో చట్టం పట్ల అవగాహన పెంచడం ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు లేదా గ్రామ ప్రజలు ఎటువంటి అనుమానాస్పద సంఘటనలు గమనించినా, అపరిచితులను చూసిన ధైర్యంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహిళ ఎస్సై రేవతి, మక్తల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.