//పయనించే సూర్యుడు// ఆగస్టు 4//మక్తల్
మక్తల్ నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి లో తీవ్రంగా టీటీ ఇంజక్షన్ ల కొరతా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన ఇంజక్షన్లు, మాత్రలు సరిపోయేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. రాత్రి సమయంలో టిటి ఇంజక్షన్ కోసం వెళితే ఇంజక్షన్లు లేవని తీవ్ర కొరత ఉందని డాక్టర్లు చెప్పడం సహజమైపోయింది.ఇప్పటికైనా వైద్య అధికారులు,ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. జె.వెంకటపతి రాజు చైర్మన్ పుడమి ఫౌండేషన్.TG