పయనించే సూర్యుడు //న్యూస్ ఏప్రిల్ 30//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
మక్తల్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయుడు, హిందీ పండిత్, ప్రముఖ సామాజిక వేత్త, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త లయన్ కందుకూరి అశోక్ కుమార్ ప్రారంభించారు. మక్తల్ పట్టణానికి చెందిన సాయిగంగా వాటర్ ప్లాంట్ యజమాని కీర్తి శేషులు డాక్టర్ సి లక్మినారాయణ సాయిరాం వారసుడైన సి రాకేష్ సౌజన్యంతో ఈ చలి వేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో సగటు మనిషికి కావలసింది పట్టెడు అన్నం గుక్కెడు నీళ్ళు ఎంతో అవసరమని అన్నారు. అదేవిధంగ వేసవి కాలంలో చలివేంద్రాల ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. మక్తల్ పట్టణ కేంద్రానికి సామాన్య ప్రజలు వారి అవసరాల నిమిత్తం వస్తుంటారు. వారికి గుక్కెడు నీళ్లు ఇచ్చి దాహార్తిని తీరిస్తే వారు ఎంతో సంతోష పడతారని సాటి మనిషికి కావలసింది ఇంతకు బాగ్యమ రొకటి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వాహిద్ అహ్మద్ ఖాన్, కంట్రోలర్ ప్రభాకర్ రంగయ్య, రవి, పరుశ రాముడు గోపాల్, నర్సిములు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.