
పయనించే సూర్యుడు: :ఫిబ్రవరి 17మక్తల్:
మక్తల్ మున్సిపల్ వైస్ చైర్మన్గా 9వ వార్డు కౌన్సిలర్ శైవీ రెడ్డి సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు . స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల ప్రత్యేక అధికారి, రాజేందర్ గౌడ్ ఆమెతో వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్పర్సన్ గా వాకిటి మానసతో పాటు వైస్ చైర్మన్గా శైవి రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది.అనంతరం వైస్ చైర్మన్ శైవి రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మున్సిపల్ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వారికి శ్రీహరి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి దిశానిర్దేశంలో, చైర్పర్సన్ మానస తో కలిసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. 9వ వార్డుతో పాటు మక్తల్ పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరినీ కలుపుకుంటూ, పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
