
డా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ {పయనించే సూర్యుడు} {ఏప్రిల్5మక్తల్ }
డా బి ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో మహాత్మా పూలే అంబేద్కర్ జయంతిల సందర్భంగా ఈ నెల 13న మక్తల్ లోని కేశవనగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర సాయంత్రం 5 గంటలకు నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఆనాడు మనుధర్మం ప్రకారం అగ్రవర్ణాల ఆధిపత్య,అణిచివేత కింద నలిగిపోతూ సామాజిక,రాజకీయ వివక్షతకు గురవుతున్న శూద్ర,అతి శూద్ర వర్గాలకు అగ్రవర్ణాలతో పాటు చదువుకునే అవకాశం దక్కాలని కొట్లాడి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహాత్మా జ్యోతిబాపూలే డా.అంబేద్కర్ ల జయంతుల సందర్భంగా మక్తల్ లో బహిరంగ సభను మరియు భీం ర్యాలీని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ఈ బహిరంగ సభలో ప్రధాన వక్తగా పాలమూరు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్,బహుజన మేధావి కుమార స్వామి తో పాటు తెలంగాణ ఉద్యమ కారుడు,మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి,DTF జిల్లా ప్రధాన కార్యదర్శి డి.జి సూర్యచంద్ర వంటి ముఖ్యవక్తలతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు మహాత్మ పూలే అంబేద్కర్ ల జీవిత ఆచరణను,ప్రస్తుత కాలానికి వారి ఆశయ సాధన ప్రాధాన్యతపై ప్రసంగిస్తరన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పూలే అంబేద్కర్,బహుజన వాదులు,ప్రజలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు.అదే విధంగా పుడమి ఫౌండేషన్ ఛైర్మన్ వేంకటపతి రాజు ఆధ్వర్యంలో రాత్రి భోజన కార్యక్రమంను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృధ్విరాజ్,మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి,దళిత నాయకులు జీర్గల్ నాగేష్ మాదిగ,BNS రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.హెచ్.జి పోలప్ప,పెరియార్ సంఘం నాయకులు అక్షయ్,పుడమి ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్, అంబేద్కర్ యువజన సంఘం సహాయ కార్యదర్శి రవికుమార్, కార్యవర్గ సభ్యులు కర్రెం శ్రీనివాస్, తల్వార్ నరేష్,గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
