//పయనించే సూర్యుడు//జులై//8 మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ కేంద్రలో MRPS ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని,ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ MRPS జిల్లా బాధ్యులు జీర్గల్ నగేష్ మాదిగ చేతుల మీదుగా ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ…. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సారథ్యంలో తలపెట్టిన ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అణగారిన కులాల ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీకగా నిజమైన పండుగ రోజు అని అన్నారు.ఈ యొక్క ఉద్యమంలో ఎంతోమంది అమరులైన మాదిగ అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి సారథ్యంలో 30 సంవత్సరాలుగా ఏబిసి వర్గీకరణ సాధించుకొనుటకై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప ఘనత ఎమ్మార్పీఎస్ ఉద్యమం అని అన్నారు.ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏబిసి వర్గీకరణ సాధించుకొనుటకు ఉద్యమం చేస్తూనే మానవత కోణంలో గుండె జబ్బు పిల్లల కోసం ఆరోగ్యశ్రీ పథకం సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకే చెందుతుందని అన్నారు. అదేవిధంగా వృద్ధులకు,వికలాంగులకు వితంతులకు పెన్షన్ల పెంపుకై పోరాటం చేసి పెన్షన్లు పెంపుకై ఎనలేని పోరాటం చేసిన ఘనత ఎమ్మార్పీఎస్ ఉద్యమం అని అన్నారు.అంతేకాకుండా ఆకలి కేకలు పోరుతో రేషన్ బియ్యం పెంచుటకై ఎనలేని కృషి చేసిన ఘనత ఎమ్మార్పీఎస్ ఉద్యమం అని అన్నారు.సమాజంలో మహిళలపై అత్యాచారాలు జరిగిన సమయంలో కుల మత భేదం లేకుండా అత్యాచార బాధితులకు అండగా నిలబడి నేరస్తులను జైల్లో పెట్టించిన ఘనత మందకృష్ణ మాదిగ గారికే చెందుతుందని అన్నారు.భవిష్యత్తులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేపట్టే ఉద్యమాలలో పాల్గొని విద్యాపరంగా,ఉద్యోగ పరంగా,రాజకీయపరంగా హక్కులు సాధించుకునే వరకు పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమాజంలో సంఘనలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు జీర్గల్ నగేష్ మాదిగ. జి నారాయణ మాదిగ. జగ్గలి అంజప్ప మాదిగ. కర్నె వెంకటేష్ మాదిగ. కొండయ్య మాదిగ. కున్సి మారుతి మాదిగ. కొత్తపల్లి తిమ్మప్ప మాదిగ. శివమణి మాదిగ. కాంగ్రెస్ పార్టీ నాయకులు గోలపల్లి నారాయణ. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తల్వార్ నరేష్. కర్రెమ్ అంజప్ప. తదితరులు పాల్గొన్నారు.