పయనించే సూర్యుడు దినపత్రిక 26 తేదీ ఏప్రిల్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీనివాస్ : మఖ్తల్ మున్సిపాలిటీ పరిధిలో సర్వేనెంబర్ 05 పంచనామ చెయ్యమని Ri 15 నెలలు అవుతుంది. ఇంతవరకు కార్యాలయం చుట్టూ తిప్పుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేస్తామని బిఎస్పి వాకిటి అంజనేయులు ముదిరాజ్ జ్యోతి రావు ఫూలే బీసీ సంఘం వ్యవస్థాపకులు* మఖ్తల్ మున్సిపాలిటీ పరిధిలో సర్వేనెంబర్ 05 లో గత ప్రభుత్వం 30 సంవత్సరాల క్రితం భూములలో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. ఒకే ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు ఆ భూమిని కబ్జా చేశారు. గతంలో సర్వేయర్ బాలరాజు గారు ఆ భూమి సర్వే చేయడానికి డబ్బులు అడగడం జరిగినది. అవినీతి కేసులో అరెస్టయ్యారు. ఆనాడు ఉన్న గిరిదవార్ విజయ్ కుమార్ గారూ బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత కొత్తగా వచ్చిన గిరిదవార్ ఒక రాజకీయ నాయకుని అండతో ఆ భూమి ఇప్పటివరకు పంచనామా చేయలేదు. ఆ రాజకీయ నాయకుడికి అండదండలతో అవినీతి,అక్రమాలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని బిఎస్సీ వాకిటి అంజనేయులు ముదిరాజ్ జ్యోతి రావు ఫూలే బీసీ సంఘం వ్యవస్థాపకులు త్వరలో నారాయణపేట జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేస్తాము అని అన్నారు.