-ఏసీపి పి.ప్రశాంత్ రెడ్డి
హసన్ పర్తి మండల్ రిపోర్టర్ సండ్ర పవన్ కళ్యాణ్ ఆగస్టు25( పయనించే సూర్యడు ):హనుమకొండ జిల్లా హాసన్ పర్తి 66వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమము పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారామ్ కర్ణ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ పింగళి . ప్రశాంత్ రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కాజీపేట అతిథులుగా 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్,వి.చేరాలు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హాజరైనారు ముఖ్య అతిథులు ఏసీపి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మనం జరుపుకునే పండుగల లో అతి పెద్ద పండుగ వినాయక చవితి పండుగని ఈ సందర్భంగా గణేష్ విగ్రహాలను నవరాత్రులు పూజించి చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుందని అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో కెమికల్స్ వాడిన రంగులు రసాయనాలతో కూడిన విగ్రహములను పూజించి చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా నీరు కలుషితం అయిపోయి చెరువులో ఉండే ప్రాణులకు హాని జరగడమే కాకుండా మనకు మరియు పశువులకు పక్షులకు క్రిమి కీటకాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని కాబట్టి మట్టి గణపతి విగ్రహాలను పూజించి చెరువులో నిమజ్జనం చేయాలని తద్వారా మన మదర్ ఎర్త్ ను కాపాడుకోవాలని మన పూర్వీకులు పరిశుభ్రమైన వాతావరణము భూమిని మనకు అందించినారని మనం కూడా మన ముందు తరాలకు మంచి వాతావరణంతో కూడిన భూమిని అందించాలని అందుకు పర్యావరణహితంతో కూడిన మట్టి విగ్రహాలను పూజించాలని మీరు మీ చుట్టుపక్కల వారికి బంధుమిత్రులకు స్నేహితులకు తెలుపాలని గత 23 సంవత్సరముల నుండి సుజాత విద్యా నికేతన్ పాఠశాల పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము 1500 మట్టి వినాయక విగ్రహాలను విద్యార్థులచే తయారు చేయించి ఉచితంగా తల్లిదండ్రులకు,చుట్టుపక్కల గ్రామంలో పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం అని ఇప్పటివరకు సుమారు 30 వేల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం వారు చేస్తున్న ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతరాంకరణని అభినందిస్తున్నామని తెలిపరు. అంతేకాకుండా మనందరం కూడా నీరు గాలి భూమిని కలుషితం చేసేటువంటి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని విద్యార్థులకు సూచించారు.వారం రోజుల నుండి పాఠశాల విద్యార్థులు కష్టపడి ఈ మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయడం అభినందనీయమని భవిష్యత్తులో కూడా గణేశుని యొక్క ఆశీస్సులతో విద్యావంతులై ఉన్నత స్థాయికి ఎదగాలని సంస్కారవంతమైన జీవితం గడపాలని అన్నారు.అనంతరం 66 డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 1500 మట్టి విగ్రహాలను విద్యార్థులచే తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేయడం చాలా సంతోషమైన విషయమని ఈ పాఠశాల చేస్తున్నటువంటి పర్యావరణహిత కార్యక్రమాలను అనేక విద్యాసంస్థలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం కూడా అనుకరించి ఈమట్టి విగ్రహాలను వినాయక చవితి పండుగ సందర్భంగా అందించడం జరుగుతుందని అందుకు మార్గదర్శకత్వం వహించినటువంటి పాఠశాల ప్రిన్సిపాల్ కృషిని అభినందిస్తున్న అభినందిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదములు తెలిపినారు అసంపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ చేరాలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు పాఠశాల యాజమాన్యం చేస్తున్న ఈ మట్టి వినాయక విగ్రహాల పంపిణీ స్ఫూర్తిదాయకమైనటువంటి విషయమని మనందరం కూడా భవిష్యత్తులో వినాయక చవితి పండుగను మట్టి వినాయక విగ్రహాలతోనే జరుపుకోవాలని కోరినారు అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ శాంతారామ్ కర్ణ మాట్లాడుతూ గత 30 సంవత్సరముల నుండి పాఠశాల పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమము ఈ మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేయడం అని గత 23 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం1700 విగ్రహాలను తయారు చేయించి పంపిణీ చేస్తున్నామని ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు గాను జాతీయస్థాయిలో ఆరు పర్యావరణ మిత్ర అవార్డులు సాధించినామని ఇకముందు కూడా తల్లిదండ్రుల యొక్క సహకారంతోటి విద్యార్థులకు విద్యతో పాటు జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తామని తెలిపరు.ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గూడూరు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.