చదివే ముద్దు, మత్తు వద్దు సందేశంతో బోధన్‌లో ఏఐపీఎస్యు ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 15 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం ఏఐపీఎస్యు ఆధ్వర్యంలో బోధన్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివే ముద్దు, మత్తు వద్దు” అనే నినాదంతో ప్రత్యేక అవగాహన సెమినార్ నిర్వహించారు. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం విద్యలో ముందంజ వేయాలని పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ మాట్లాడుతూ, “మత్తు పదార్థాలు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి కానీ శాశ్వతంగా జీవితాన్ని నాశనం చేస్తాయి. విద్యార్థులు ఈ దారిలోకి పోకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బోధన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ అమృత హాస్పిటల్స్ బోధన్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ సుధాకర్ పాల్గొని యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ పై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. బోధన్ పట్టణ మరియు ఎక్సైజ్ శాఖ సిఐలు వెంకట్ నారాయణ భాస్కర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో మార్పుకు దారి చూపే మార్గమని, వారు మత్తుపదార్థాల వ్యసనానికి దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబించాలి అని అన్నారు. ఆర్ ఎస్ పి రాష్ట్ర సహాయ కార్యదర్శి యార్లగడ్డ సాయిబాబా,ఏఐపీఎస్యు జిల్లా అధ్యక్షులు సాయికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాగూర్ తదితర నాయకులు విద్యార్థులలో డ్రగ్స్ వ్యతిరేక పోరాటంను విస్తృతంగా చేపట్టేలా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు