--- మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం
----- హ్యూమన్ రైట్స్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం.
పయనించే సూర్యుడు, జనవరి10( వైరా నియోజకవర్గ రిపోర్టర్ ఆదూరి ఆనందం )కొణిజర్ల మండలం, సింగరాయపాలెం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బహుజన అభ్యుదయ సేవా సమితి అధ్యక్షురాలు, హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కె. లక్ష్మీనారాయణ అధ్యక్షతన మానవ హక్కులపై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూమత్తు పదార్దాలకు దూరంగా ఉండాలని, మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని సూచించారు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గూర్చి వివరించారు పాఠశాలలో గానీ, గ్రామంలో గానీ మీ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 1098 కి కాల్ చేసి పిర్యాదు చేయవచ్చని బాలికలకు తెలియజేసారు.సందర్బంగా హ్యూమన్ రైట్స్ సొసైటీ రాష్ట్ర ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఆదూరి మణి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిల్లిముంత వెంకటేశ్వరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయిలూరి శ్రీనివాసరెడ్డి బాల్య వివాహాలు, విద్యా హక్కు చట్టం, బాలల హక్కులను గూర్చి వివరించారు. మా పనులు మేము చేసుకుంటూ కొంత సమయాన్ని మానవ హక్కులను ప్రచారం చేయడానికి స్వచ్చందంగా పనిచేస్తూ , ఆశా కార్యకర్తలకు డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు, అంగన్వాడీ లకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కె. లక్షినారాయణ మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ సొసైటీ చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తున్నామని మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలని, హ్యూమన్ రైట్స్ సొసైటీ బృందానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ,కొణిజర్ల మండల అధ్యక్షులు కొమ్ము భద్రయ్య, మండల కార్యదర్శి గొల్లమందల నాగేశ్వరావు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.