ప్రపంచంలోని మొట్టమొదటి నర్స్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం మే 12 వ తారీకున ప్రపంచ నర్స్ డే
పయనించే సూర్యుడు మే12 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి ప్రపంచ నర్స్ డే ను పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని హెడ్ నర్సింగ్ ఆఫీసర్ జగదాంబ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేష్ మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన వృత్తి ఏదైనా ఉంది అంటే అది నర్సింగ్ వృత్తి అని అత్యంత ఓపిక సహనం సేవా నిరతి కలిగి తమ అమూల్యమైన సేవలతో నిత్యం ఎంతోమంది రోగులకు ప్రాణం పోస్తూ వారు త్వరితగతన కోలుకోవడానికి అందించే సేవలు వెలకట్టలేనివి అని ఈ వృత్తి అందరికీ రాదని నిష్కల్మషంగా రోగులకు సేవలు అందించే నర్సులమ్మలందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలోకమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, నర్సింగ్ ఆఫీసర్ జగదాంబ సూపర్వైజర్లు గుజ్జా విజయ పోరండ్ల శ్రీనివాస్ ధర్మపురి రవికుమార్ కిరణ్ కుమారి రాజు గంటా శ్రీనివాస్ నాగలక్ష్మి కమల రమా కుమారి సుజాత కళావతి స్వప్న లక్ష్మీ బాయి అరుణ్ కుమారి స్రవంతి వెంకటరమణ అనసూర్య మల్లు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారుx