
//పయనించే సూర్యుడు// మార్చ్15
ఈ రోజు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో మద్దూరు మండల కేంద్రం లో జనసేనపార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి మద్దూరు మండలం జనసైనికులు అరుణ్ కుమార్ గౌడ్ అశోక్ కుమార్ వెంకటేష్ అంజనేయులు ఆధ్వర్యం లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరానీ అంటాయి బాణసంచా తో పండగల జరిగాయి ఈ కార్యక్రమానికి మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ ముఖ్య అతిథి గా హాజరు అయ్యారు ఆయన జనసేన ఉమ్మడి మద్దూరు మండల పార్టీ శ్రేణులకు జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవ శు భాకాంక్షలు తెలియజేశారు
ఈ రోజు మద్దూరు మండలం లో జనసేన పార్టీ జెండా ఎగిరిందంటే ఇక్కడ ఉన్న జనసైనికుల కష్టం ఎంతైనా ఉంది మీరందరూ మన అధినేత పవన్ కళ్యాణ్. అడుగు జాడల్లో నడిచి పార్టీ బలోపేతం కోసం పని చేసి రానున్న రోజుల్లో తెలంగాణ లో జనసేన పార్టీ ఎగరవేయడానికి మన వంతుగా మనం పార్టీ కోసం పని చేయాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జనసైనికుడిని కోరుతున్నాను అని ఆయన అన్నారు
మన అధినేత పవన్ కళ్యాణ్.అన్ని తానై పార్టీ ని పుష్కరకాలం పాటు ఎన్ని కష్టాలొచ్చినా వ్యక్తి గతంగా ఎన్ని విమర్శలు వచ్చిన ఒక్కడై నిలబడి మనల్ని తలెత్తుకొని గర్వించేలా ఆయన ఆంధ్రప్రదేశ్ లో 23 సీట్లకు 23 సీట్లు గెలుచుకొని దేశంలోనే ప్రతి ఒక్కరూ మన వైపు చూసేలా చేశారు అలాంటి గొప్ప వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీ కండువా వేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి కావున జనసేన నాయకుల్లారా యువకులారా రండి కదలండి కదం తొక్కండి ప్రజా సమస్యలపైన పోరాడి జనసేన పార్టీ జెండా ఎగరవేద్దం అని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో ఉమ్మడి మద్దూరు మండల యువకులు స్వచందంగా పార్టీ లో చేరడం జరిగింది వారిని రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్కమిటీ సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీ లో కి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

